అగ్ని క్షిపణులు

అగ్ని క్షిపణులు భారత రక్షణ వ్యవస్థ అభివృద్ధి చేసిన క్షిపణులు. మధ్యరకం దూరాల నుంచి ఖండాంతరాలను ఛేదించగల క్షిపణుల శ్రేణి ఇది. వీటిని సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా హైదరాబాదు లోని డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ శ్రేణిలో నాలుగు రకాలైన క్షిపణులు అందుబాటులోకి ఉండగా, ఐదవది పరీక్షల దశలోను, ఆరవది అభివృద్ధి దశలోనూ ఉంది.

అగ్ని-1అగ్ని-2అగ్ని-3అగ్ని-4అగ్ని-5అగ్ని-6
రకంMedium-range ballistic missile (అగ్ని-1)
Intermediate-range ballistic missile (అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4)
Intercontinental ballistic missile (అగ్ని-5, అగ్ని-6)
అభివృద్ధి చేసిన దేశంIndia
సర్వీసు చరిత్ర
సర్వీసులో(పరీక్షలు) 1999 ఏప్రిల్ 11, 2001 జనవరి 17, 2004 ఆగస్టు 29, 2014 డిసెంబరు 2
వాడేవారుIndia
ఉత్పత్తి చరిత్ర
తయారీదారుDefence Research and Development Organisation (DRDO), Bharat Dynamics Limited (BDL)
ఒక్కొక్కదాని వెల250 మిలియను (US$3.1 million) to 350 మిలియను (US$4.4 million) (Agni II)[1]
విశిష్టతలు
బరువు12,000 kg (Agni-I)[2]
16,000 kg (Agni-II)
48,000 kg (Agni III)
22,000 kg [3] (Agni-III latest version)[4]
17,000 kg (Agni-IV)[5]
49,000 kg (Agni-V)[4]
55,000 kg (Agni VI)[6]
పొడవు15 మీ (అగ్ని-I)[2]
21 మీ (అగ్ని-II)[7]
17 m (Agni-III)[8]
20 m (Agni-IV)[5]
17.5 m (Agni-V)[4]
వ్యాసం1.0 m (అగ్ని-I, అగ్ని-II)
2.0 మీ (అగ్ని-III, అగ్ని-V)
1.1 మీ (అగ్ని-VI)[6]
వార్‌హెడ్Strategic nuclear (15 kt to 250 kt), conventional HE-unitary, penetration, sub-munitions, incendiary, or fuel air explosives

ఇంజనుఒకే దశ (అగ్ని-I)
రెండున్నర దశల (అగ్ని-II)
రెండు దశల (అగ్ని-III) ఘన ఇంధన ఇంజను
ఆపరేషను
పరిధి
700–1,250 km (Agni-I)[2][9]
2,000–3,500 km (Agni-II)[7]
3,500–5,000 km (Agni-III)[10]
Over 5,500 km (Agni-V)[11]
8,000–10,000 km (Agni VI)[6]
ఫ్లైటు ఎత్తు300 కిమీ (అగ్ని-I)[12]
230 km (Agni-II),[7][13]
350 km (Agni-III)[14]
వేగం2.5 km/s (Agni-I)[15]
3.5 km/s (Agni-II)[7][16]
గైడెన్స్
వ్యవస్థ
Ring laser gyro-INS (inertial navigation system), optionally augmented by GPS terminal guidance with possible radar scene correlation
లాంచి
ప్లాట్‌ఫారం
8 × 8 Tatra TELAR (Transporter erector launcher) Rail Mobile Launcher
NameTypeRange
అగ్ని-1మధ్య పరిధి క్షిపణి700 – 1,250 కిమీ[2][17] (మోహరించబడింది)
అగ్ని-2మధ్యంతర పరిధి క్షిపణి2,000 – 3,000 కిమీ[18] (మోహరించబడింది)
అగ్ని-3మధ్యంతర పరిధి క్షిపణి3,500 – 5,000 కిమీ[10] (మోహరించబడింది)
అగ్ని-4మధ్యంతర పరిధి క్షిపణి3,000 – 4,000  కిమీ[19] (మోహరించబడింది)
అగ్ని-5ఖండాంతర క్షిపణి5,000 – 8,000 కిమీ[20][21][22] (పరీక్షలలో ఉంది)
అగ్ని-6ఖండాంతర క్షిపణి8,000 – 10,000 కిమీ[23][24][25] (అభివృద్ధిలో ఉంది)

అగ్ని-1

మార్చు
Agni Missile (DRDO, Dighi, Pune, India ) (1)

రెండు దశల అగ్ని సాంకేతికత ప్రదర్శనను 1989 లో చాందీపూర్ మధ్యంతర టెస్ట్ రేంజ్ వద్ద మొదటిసారి పరీక్షించారు. దానికి 1,000 కెజిల సాంప్రదాయిక పేలోడ్‌ను గానీ, అణు వార్‌హెడ్‌ను గానీ మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. ఈ సాంకేతిక ప్రదర్శన క్షిపణియే తదనంతర కాలంలో అగ్ని-1, అగ్ని-2 క్షిపణులుగా అభివృద్ధి చెందింది. వీటిలో ముందుగా అభివృద్ధి అయింది, రెండు దశలతో 2,000 కిమీ పరిధి గల అగ్ని-2. అది 1999 లో పరీక్షించబడింది. ఆ తరువాత దానిలోని మొదటిదశను మాత్రమే తీసుకుని 700 కిమీ పరిధి గల అగ్ని-1 ని అభివృద్ధి చేసారు. దాన్ని మొదటిసారి 2002 జనవరిలో పరీక్షించారు.

15 మీటర్ల పొడవుతో, 12 టన్నుల బరువుతో ఉండే అగ్ని-1 కి 700–1250 కిమీ పరిధి ఉంది.[17] అది 1000 కెజిల సాంప్రదాయిక పేలోడ్‌ను గానీ, అణు వార్‌హెడ్‌ను గానీ 2.5 కిమీ/సె వేగంతో మోసుకుపోగలదు.[2] అగ్ని-1 ని భారత సైన్యానికి చెందిన వ్యూహాత్మక బలాల కమాండ్ (SFC) ఉపయోగిస్తుంది.[2] చివరిసారిగా 2012 జూలై 13 న వీలర్ ఐలండ్‌లో దీన్ని విజయవంతంగా పరీక్షించారు.[26] 2014 ఏప్రిల్ 11 న అక్కడే మొట్టమొదటి సారి రాత్రి పరీక్ష చేసారు. ఉత్పత్తిలో ఉన్న క్షిపణుల్లో ఒకదాన్ని యథాలాపంగా ఎంచుకుని రాత్రి 11 గంటల వేళ వ్యూహాత్మక బలాల కమాండ్ ఈ పరీక్ష నిర్వహించింది.అంతకు ముందు చేసిన రెండు పరీక్షలు సాంకేతిక లోపాల కారణంగా విఫలమయ్యాక ఈ పరీక్ష చేసారు.[27]

ప్రత్యేక ఆయుధాలతో అగ్ని- 1 1200 కిమీ పరిధిని చేరగలదు. అగ్ని-2 తో పోలిస్తే, అగ్ని-1 చవకైనది, సరళమైనది, కచ్చితమైనది, తేలిగ్గా మోసుకుపోగలిగినది.

అగ్ని-2

మార్చు
అగ్ని-II ballistic missile

అగ్ని-2, 20 మీటర్ల పొడవు, 1 మీటరు వ్యాసం, 18 టన్నుల బరువుతో ఉంటుంది. దాని పరిధి 2,000-2,500 కిమీ. దాని రెండు దశల్లోనూ ఘన ఇంధనం వాడుతారు.[28] చైనా, పాకిస్తాన్లకు వ్యతిరేకంగా అభివృద్ధి చేస్తున్న విశ్వసనీయ నిరోధకంలో భాగమే అగ్ని-2 అని భావిస్తారు. తన అణు, క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కాదని, పాకిస్తాన్ నుంచి ఉన్న ప్రమాదం భారత భద్రతా వ్యవస్థలో ఒక చిన్న అంశమనీ భారత్ చెప్పింది. "చైనా, భారత సమీకరణమనే పెద్ద అంశానికి సంబంధించి "విశ్వసనీయ నిరోధకం" అభివృద్ధి చేసే కార్యక్రమానికి అగ్ని కేంద్ర బిందువు" అని కూడా భారత్ చెప్పింది.[29]

2000 కిమీ పరిధితో అణు సామర్థ్యం గల అగ్ని-2 ఈసరికే భారత సైనిక బలగాల్లో చేరింది. వ్యూహాత్మక బలాల కమాండ్ 2012 ఆగస్టు 9 న శిక్షణా తరగతులలో భాగంగా అగ్ని-2 ను పరీక్షించింది.[30][31] 2013 ఏప్రిల్ 7 న శిక్షణా తరగతుల్లో భాగంగా భారత సైన్యం మరో పరీక్ష నిర్వహించింది.[32]

అగ్ని-3

మార్చు

అగ్ని శ్రేణిలో అగ్ని-3 మూడవ క్షిపణి. దాని రెండు దశల్లో కూడా ఘన ఇంధనాన్ని వాడుతారు.[28] అగ్ని-3 మొదటిసారి 2006 జూలై 9 న వీలర్ ఐలాండ్ లో పరీక్షించారు. రెండవదశ విడిపోకపోవడం చేత, క్షిపణి, దాని లక్ష్యం కంటే బాగా తక్కువ దూరంలోనే పడిపోయింది. మళ్ళీ 2007 ఏప్రిల్ 12 న చేసిన పరీక్ష విజయవంత మయింది. 2008 మే 7 న మరో పరీక్షను విజయవంతంగా నిర్వహించడంతో, క్షిపణి సైన్యంలోకి చేరడానికి సిద్ధమయిందని నిరూపితమైంది. దీనితో శత్రు దేశాల లోని ముఖ్యమైన ప్రాంతాలు భారత అణు దృష్టిలోకి వచ్చేసాయి. 3,500 కిమీ పరిధి కలిగిన అగ్ని-3, 1.5 టన్నుల ఆయుధాన్ని మోసుకుపోగలదు.[33]

అగ్ని-3 యొక్క వర్తుల దోష పరిధి 40 మీటర్లని వార్తలు వచ్చాయి. తన శ్రేణి క్షిపణులలో అగ్ని-3 [34] ప్రపంచంలోనే అత్యంత కచ్చితత్వం కలిగిన క్షిపణిగా పేరొందింది.[33] ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన విషయం - ఇది క్షిపణి నాశన సమర్ధతను పెంచుతుంది. తక్కువ యీల్డ్ ఉన్న అణు బాంబులను వాడి కూడా, తలచిన విధ్వంసాన్ని సాధించవచ్చు. తక్కువ అణు ఇంధనంతో ఎక్కువ బాంబులను తయారుచెయ్యవచ్చు. మిగతా అణు సంపన్న దేశాలు తయారు చేసిన బాలిస్టిక్ క్షిపణులకు, ఇంతే విధ్వంసాన్ని కలిగించేందుకు గాను, ఎక్కువ యీల్డ్ ఉన్న వార్‌హెడ్లను వాడాల్సి వచ్చేది. తక్కువ పేలోడ్లతో అగ్ని-3, 3,500 కిమీ కంటే చాలా దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు.

అగ్ని-4

మార్చు

అగ్ని-4, అగ్ని శ్రేణిలో నాలుగోది. మొదట్లో దీన్ని అగ్ని-2 ప్రైమ్ అనేవారు.[35] అగ్ని-4 ను మొదట 2011 నవంబరు 15 న, తరువాత 2012 సెప్టెంబరు 19 న వీలర్ ఐలండ్ నుండి పరీక్షించారు. రోడ్ మొబైల్ లాంచరు ద్వారా ప్రయోగించబడిన అగ్ని-4, 800 కిమీ ల ఎత్తుకు వెళ్ళిన తరువాత, భూ వాతావరణంలోకి పునఃప్రవేశించి, హిందూ మహాసముద్రంలో నిర్దేశించిన స్థలంలో చక్కటి కచ్చితత్వంతో ఢీకొట్టింది. మొత్తం ప్రయాణానికి 20 నిముషాలు పట్టింది. ఒక టన్ను బరువున్న ఆయుధాల బరువుతో భూ వాతావరణంలోకి పునఃప్రవేశించిన క్షిపణి, విపరీతమైన ఉష్ణోగ్రతలను -3,000 °సెల్సియస్- తట్టుకుని ప్రయాణించింది. 3,000–4,000 కిమీ పరిధితో, [36][37] అగ్ని-2, అగ్ని-3 ల మధ్య ఉన్న పరిధి అంతరాన్ని అగ్ని-4 పూరిస్తుంది. 2014 జనవరి 20 న అగ్ని-4 ను మళ్ళీ విజయవంతంగా పరీక్షించారు.[38] అగ్ని-4 లో రింగ్ లేజర్ గైరో, కాంపోసైట్ రాకెట్ మోటార్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఇది రెండు దశలు కలిగి, రెండింటిలోనూ ఘన ఇంధనాన్ని వాడుతుంది. దాని పొడవు 20 మీటర్లు, బరువు 17 టన్నులు.[35] దీన్ని రోడ్ మొబైల్ లాంచరుతో ప్రయోగించవచ్చు.[35][39][40]

అగ్ని-5

మార్చు

అగ్ని 5 ఘన ఇంధనంతో నడిచే ఒక ఖండాంతర క్షిపణి. దీన్ని డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) తయారుచేసింది. భారత్ 5,500 కిమీ పైబడిన లక్ష్యాలను ఛేదించడానికి దోహదం చేస్తుంది. అగ్ని-5 మొదట 2012 ఏప్రిల్ 19 న విజయవంతంగా పరీక్షించారు.[41][42] రెండు దశల అగ్ని-3 క్షిపణికి మూడో కాంపోజిట్ దశను చేర్చి అగ్ని 5 ను తయారు చేసారు. బరువు తగ్గించడం కోసం అగ్ని-5 ని ఎక్కువ కాంపోజిట్ పదార్థాలతో తయారు చేసారు. 17.5-మీటర్ల పొడవైన అగ్ని-5 క్యానిస్టర్ నుండి ప్రయోగించ దగ్గ క్షిపణి. ఈ కారణంగా దీన్ని ఎక్కడికైనా త్వరగా రవాణా చేసి, ఎక్కడినుంచైనా త్వరగా ప్రయోగించే వీలుంది. అగ్ని-5 దాదాపు 49 టన్నుల బరువుతో, అగ్ని-3 కంటే ఒక టన్ను ఎక్కువగా, ఉంటుంది. కానీ అగ్ని-3 కంటే చాలా ఎక్కువ పరిధి కలిగి ఉంటుంది. అగ్ని-5 యొక్క రెండో పరీక్ష 2013 సెప్టెంబరు 15 న విజయవంతంగా జరిగింది.[43] 2015 జనవరిలో క్యానిస్టరు రకాన్ని జయప్రదంగా పరీక్షించారు..[44]

అగ్ని-6

మార్చు

అగ్ని-6 ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. అగ్ని క్షిపణి కార్యక్రమంలో ఇది తాజాది, అత్యంత ఆధునికమైనదీను. భూమ్మీదనుండి, జలాంతర్గాముల నుండి కూడా ప్రయోగించగల సామర్థ్యంతో, 8,000–10,000 కిమీ పరిధితో, MIRV సామర్థ్యం కలిగి ఉంటుంది.[24][45][46]

విశేషాలు

మార్చు
క్షిపణిప్రాజెక్టురకంవార్‌హెడ్పేలోడ్ (కెజి)పరిధి (కిమీ)పరిమాణం (మీ)ఇంధనం/దశలుబరువు (కెజి)ఎప్పటినుండి పనిచేస్తోందివర్తుల దోష పరిధి (మీ)
అగ్ని-IIGMDPవ్యూహాత్మకNuclear, HE, penetration, sub-munitions, FAE1,000700–1,250[47]15X1ఒకే దశ ఘన12,000200225[48]
అగ్ని-IIIGMDPవ్యూహాత్మకNuclear, HE, penetration, sub-munitions, FAE750–1,0002,000–3,500[49]20X1రెండున్నర దశలు, ఘన ఇంధనం[50]16,000199930
అగ్ని-IIIIGMDPవ్యూహాత్మకNuclear, HE, penetration, sub-munitions, FAE2,000–2,5003,500–5,000[51]17X2రెండు దశలు, ఘన ఇంధనం44,000

22,000 (ఇట్టీవలి కూర్పు) [52]

201140
అగ్ని-IVఅగ్ని-IVవ్యూహాత్మకNuclear, HE, penetration, sub-munitions, FAE800–1,0003,000–4,00020X1రెండు దశలు, ఘన ఇంధనం17,0002014
అగ్ని-Vఅగ్ని-Vవ్యూహాత్మకNuclear, HE, penetration, sub-munitions, FAE1,500 (3–10 MIRV)5,500–8,00017X2మూడు దశలు, ఘన ఇంధనం50,000పరీక్షించారు<10 మీ[52]
అగ్ని-VIఅగ్ని-VIవ్యూహాత్మకNuclear, HE, penetration, sub-munitions, FAE1,000 (10 MIRV)8,000-10,000[53]40X1.1[6]మూడు దశలు, ఘన ఇంధనం55,000[6]అభివృద్ధి దశ

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు వనరులు

మార్చు