కృష్ణమాచారి శ్రీకాంత్

క్రికెట్ ఆటగాడు

1959 డిసెంబర్ 21చెన్నైలో జన్మించిన కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1981లో ఇంగ్లాండు పై అహ్మదాబాదులో తొలి వన్డే, ముంబాయిలో తొలి టెస్ట్ ఆడి అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశించాడు. 21 ఏళ్ళ వయసులోనే సునీల్ గవాస్కర్కు జతగా ఓపెనర్ గా భారత జట్టు తరఫున ఆడినాడు. అయితే ఇద్దరికీ ఆట విధానమ్లో చాలా తేడా ఉంది. గవాస్కర్ నైపుణ్యం కల బ్యాట్స్‌మెన్ కాగా శ్రీకాంత్ బ్యాటింగ్ హిట్టర్. తన హిట్టింగ్ ద్వారా ముఖ్యంగా వన్డేలలో భారత జట్టుకు మంచి శూభారంభం చేసేవాడు. గవాస్కర్, రవిశాస్త్రి, దిలీప్ వెంగ్‌సర్కార్, మోహిందర్ అమర్‌నాథ్ లాంటి నైపుణ్యం కల బ్యాట్స్‌మెన్ ల కాలంలోనూ జట్టులో హిట్టర్ గా నిలదొక్కున్నాడంటే అతని ప్రతిభను ప్రశంసించాల్సందే. అతని 43 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 2062 పరుగులు చేసాడు. ఇందులో 2 సెంచరీలు, 12 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో భారత జట్టుకు 146 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించి 4091 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 27 అర్థ సెంచరీలు ఉన్నాయి. 1983లో ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో కూడా ఇతను ప్రాతినిధ్యం వహించాడు. 1989లో శ్రీకాంత్ భారత జట్టు కెప్టెన్ గా నియమించబడ్డాడు. ఒకే వన్డేలో 5 వికెట్లు, అర్థ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడితను. 1988లో న్యూజీలాండ్ పై విశాఖపట్నం వన్డేలో ఈ ఘనత సాధించాడు. క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తర్వాత ఇండియా-ఏ జట్టుకు కోచింగ్ ఇచ్చి మంచి ఫలితాలను సాధించాడు. ప్రస్తుతం ఇతను టెలివిజన్ వ్యాఖ్యాతగా రాణిస్తున్నాడు.

కృష్ణమాచారి శ్రీకాంత్
Krishnamachari Srikkanth with Dr.K. Hari Prasad at a social-awareness event
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కృష్ణమాచారి శ్రీకాంత్
పుట్టిన తేదీ (1959-12-21) 1959 డిసెంబరు 21 (వయసు 64)
మద్రాసు, India
బ్యాటింగుRight hand bat
బౌలింగుRight arm medium, Off spin
బంధువులుAnirudha Srikkanth (కొడుకు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 43)1981 నవంబరు 27 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1992 ఫిబ్రవరి 1 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 146)1981 నవంబరు 25 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1992 మార్చి 15 - దక్షిణాఫ్రికా తో
కెరీర్ గణాంకాలు
పోటీటెస్టులువన్‌డేలుs]]
మ్యాచ్‌లు43146
చేసిన పరుగులు20624091
బ్యాటింగు సగటు29.8829.01
100లు/50లు2/124/27
అత్యధిక స్కోరు123123
వేసిన బంతులు216712
వికెట్లు025
బౌలింగు సగటు25.64
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు5/27
క్యాచ్‌లు/స్టంపింగులు40/042/0
మూలం: [1], 2009 అక్టోబరు 7

బయటి లింకులు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు
🔥 Top keywords: మొదటి పేజీఅన్నదాత సుఖీభవ పథకంవాతావరణంప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usమాదక ద్రవ్యాలునాగ్ అశ్విన్నారా చంద్రబాబునాయుడుఈనాడుకల్క్యావతారముమహాభారతంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలుగు అక్షరాలులోక్‌సభ స్పీకర్కల్కి 2898 ఏ.డీతెలుగువంగ‌ల‌పూడి అనితబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఅశ్వత్థామమహాత్మా గాంధీపాలస్తీనాకాట ఆమ్రపాలిరామావతారంరామాయణంపవన్ కళ్యాణ్బి.ఆర్. అంబేద్కర్గాయత్రీ మంత్రంఛత్రపతి సాహు మహరాజ్భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఓం బిర్లాభారత రాజ్యాంగంభారత అత్యవసర స్థితినక్షత్రం (జ్యోతిషం)జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షకర్ణుడుఛత్రపతి శివాజీసప్త చిరంజీవులు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుశ్రీ కృష్ణుడు