ఫిఫా ప్రపంచ కప్

ఫిఫా ప్రపంచ కప్ (FIFA World Cup), లేదా క్లుప్తంగా ప్రపంచ కప్, అని పేరొందిన ఫుట్‌బాల్ పోటీ ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడా పోటీ అని చెప్పవచ్చు. ఈ పోటీలో ఫుట్‌బాల్ ఆటలో వాసికెక్కిన జాతీయ జట్లు, తమ దేశాలకి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ ఆటలపోటీలు 1930 లో మొదలయ్యి, నాలుగేళ్ళకోసారి (1942,46 లో ద్వితీయ ప్రపంచ యుద్ధం మూలాన తప్ప) కొనసాగుతూ వస్తున్నాయి. ప్రస్తుత విజేత అర్జెంటీనా, ఖతార్‌లో జరిగిన 2022 ఫిఫా ప్రపంచ కప్ లో ఫ్రాన్స్‌ను ఓడించి, కప్పును స్వంతం చేసుకుంది. 2026 ప్రపంచ కప్ పోటీలు అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి.

ఫిఫా ప్రపంచ కప్
స్థాపితము1930
జట్ల సంఖ్య32
(2022 లో మొత్తం పాల్గొన్న జట్లు)
ప్రస్తుత ఛాంపియన్లుఅర్జెంటీనా అర్జెంటీనా (విజేత 2022)
అత్యంత విజయవంతమైన జట్టు (లు)బ్రెజిల్ బ్రెజిల్ (5 గెలుపులు)
వెబ్‌సైట్అధికారిక జాలపుట
2022 ఫిఫా ప్రపంచ కప్

2022 ప్రపంచ కప్‌ వరకు 32 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంటును 2026 నుండి 48 జట్లు పాల్గొనేలా విస్తరించారు. దాదాపు మూడేళ్ళ పాటు ప్రాథమిక పోటీలు నిర్వహించి ఎంపికచేసిన అత్యుత్తమ జట్ల మధ్య నెల్లాళ్ళపాటు అంతిమ పోటీల లో బలాబల నిర్ణయం జరుగుతుంది. కొన్ని గుంపులుగా విభజించిన ఈ జట్లమధ్య పరస్పర పోటీలలో గెలిచిన విజేతలు, ముందుకెళ్ళి ఇతరవిజేతలతో తలబడతాయి. ఆతిథ్యమిచ్చే జట్టు వీటిలో ఒక జట్టు అవడం కద్దు.

ఇంతవరకూ జరిగిన 22 ప్రపంచ కప్ ఆటలపోటీల్లో 8 జట్లే చివరికి విజేతలుగా రావడం విశేషం. ప్రతి సారీ పోటీలో పాల్గొన్న ఏకైక జట్టు బ్రెజిల్. అది కప్పును 5 సార్లు గెలవగా, ఇటలీ, జర్మనీలు నాలుగు సార్లు,అర్జెంటీనా మూడుసార్లు, ఉరుగ్వే,ఫ్రాన్స్‌లు రెండేసి సార్లు నెగ్గాయి. ఇంగ్లాండ్, స్పెయిన్లు ఒకొక్కసారి గెలిచాయి.

2014 జూలైలో బ్రెజిల్లో జరిగిన ప్రపంచ కప్, ఆ తరువాత 2018 లో రష్యా లోనూ అటుపిమ్మట 2022 లో కతార్ లోనూ జరిగాయి. 2026 టోర్నమెంటును అమెరికా, కెనడా, మెక్సికోల్లో సంయుక్తంగా జరపాలని ఫిఫా నిశ్చయించింది. ప్రపంచంలోనే అత్యధికులు వీక్షించే ఆటలపోటీలు ఈ ఫిఫా ప్రపంచ కప్‌వే.

చరిత్ర

మార్చు
ఫిఫా ప్రపంచ కప్ ఆతిథ్యదేశాలు, 1930-2022. Dark green: once; light green: twice

మునుపటి అంతర్జాతీయ పోటీలు

మార్చు

ఫిఫా 1904 లో స్థాపించబడ్డాక మొదటిసారి ఒలింపిక్స్ కి బయట స్విట్జర్లాండులో 1906లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడా పోటీలను నిర్వహించజూసింది, కానీ అది ఆశించినంతగా విజయం సాధించలేక పోయింది. 1908 లండన్ లో జరిగిన వేసవి ఒలింపిక్స్ లో మొట్టమొదటి అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీలు జరిగాయని చెప్పవచ్చు. దీనిలోనూ తరువాతి 1912 స్టాక్ హోమ్ లో జరిగిన ఒలింపిక్స్ లోనూ కూడా బ్రిటన్ బంగారు పతకాలను గెలుచుకుంది. ఇవన్నీ కూడా అభిలాషకుల (అమెచ్యూర్) క్రీడలుగానే పరిగణిస్తారు.

1914 లో, ఫిఫా వేసవి ఒలింపిక్స్ ని అభిలాషకుల ఆటగా గుర్తించింది. తద్వారా 1920 లో తొలిసారి ప్రపంచ వ్యాప్తంగా 14 దేశాలు (13 యూరోపియన్ దేశాలూ, ఈజిప్ట్ తో పాటు) పోటీ పడ్డ ఒలింపిక్ పోటీలో బెల్జియం విజేతగా నిల్చింది. తదుపిమ్మటి రెండు ఒలింపిక్స్ 1924, 1928 లోనూ ఉరుగ్వే విజయకేతనం ఎగుఱవేసింది. 1924లోనే ఫిఫా ఆధ్వర్యంలో వృత్తిపరమైన క్రీడాకారుల శకం కూడా ప్రారంభమైంది..

వివిధ దేశాల అత్యుత్తమ ఫలితాలు

రెండో ప్రపంచ యుద్ధానికి ముందఱి ప్రపంచకప్

మార్చు
ఎస్టాడియో సెంటినారియో - 1930 లో ఉరుగ్వే, మోంటెవీడియోలో జరిగిన తొలి ప్రపంచ కప్ వేదిక.

ఫుట్‌బాల్ ఆట ఒలింపిక్స్ లో సంతరించుకున్న ప్రాధాన్యత దృష్ట్యా 1928 నుండి ఫిఫా వృత్తిపరమైన ఆటలపోటీల పై కృషిచేసింది. తమ స్వాతంత్ర్య శతాబ్ది జరుపుకుంటూన్న సందర్భంలో రెండుసార్లు ఒలింపిక్స్ ఫుట్‌బాల్ బంగారు పతకాలను అప్పటికే అందుకున్న ఉరుగ్వే 1930లో తొలి ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యమిచ్చింది. కానీ అంతదూర ప్రయాణమైన అమెరికా ఖండానికి జట్టుని పంపించడాన్ని, ఉరుగ్వేని తొలిసారి ఎంపిక చేయడాన్ని కూడా అంతగా నచ్చుకోని (ముఖ్యంగా యూరోపియన్) సభ్యదేశాలు పెద్దగా సుముఖత చూపలేదు. చివరికి పోటీలు 2 నెలల్లో ఉన్నాయనగా ఫిఫా అధ్యక్షుడు రిమెట్ తీసుకున్న చొఱవవల్ల బెల్జియం, ఫ్రాన్స్, రొమేనియా, యుగోస్లేవియాలు మాత్రం తమ జట్లను ఈ పోటీలకు పంపించాయి. మొత్తం పాల్గొన్న 13 దేశాలలో 7 దక్షిణ అమెరికా దేశాలు, 4 యూరోపియన్ దేశాలు, మిగిలిన రెండూ ఉత్తర అమెరికా నుండి వచ్చినవి.93,000 మంది ప్రత్యక్ష ప్రేక్షకుల సమక్షంలో పొరుగుదేశం అర్జెంటీనాను ఓడించి, ఉరుగ్వే ఈ మొట్టమొదటి బహుమానాన్ని కైవశం చేసుకుంది.[1]

1932లో లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఒలింపిక్స్ లో ఫుట్‌బాల్ ఆటను చేర్చలేదు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోలో ఈ ఆటకు అంతగా ప్రజాదరణ లేకపోవడమే దీనికి కారణం. అటుతరువాతి సంవత్సరాలలో యుద్ధవాతావరణం నెలకొనడం వల్ల, 1938, 1946 సంవత్సరాలలో ఐరోపా కి వెళ్ళిన ఏకైక దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్ మాత్రమే. 1942 లో నాజీ జర్మనీ

ఆతిథ్యమీయ తలపెట్టిన ఒలింపిక్స్ రద్దయ్యాయి.

రెండో ప్రపంచ యుద్ధం తరువాతి ప్రపంచ కప్

మార్చు

బ్రెజిల్ లో 1950లో జరిగిన ప్రపంచ కప్ పోటీలలో తొలిసారి బ్రిటన్, దాని సామంత దేశాలు పాల్గొన్నాయి. ఈ పోటీలో అంతిమ సమరంలో బ్రెజిల్ ను ఓడించి, ఉరుగ్వే మరలా ప్రపంచ కప్ ను స్వంతం చేసుకుంది.

1934 నుండి and 1978 వరకూ జరిగిన అన్ని ప్రపంచకప్ పోటీలలోనూ, 16 జట్లు పోటీ పడవలసింది.. కానీ 1938 లో మాత్రం ఆస్ట్రియా నాజీ జర్మనీలో కలిసిపోయినందువల్ల 15 జట్లే ఆడాయి.. 1950 లో భారత, స్కాట్లాండ్, టర్కీ జట్లు పోటీలకు ఎంపికైన పిమ్మట వైదొలగడంతో 13 జట్లే పోటీలో మిగిలాయి. రాశిలోనే కాక వాసిలో కూడా దక్షిణ అమెరికా/యూరోపియన్ దేశాలదే పై చేయిగా ఉండేది.

32 జట్లకు వ్యాపించడం

మార్చు

1982 నుండి 24 జట్లకూ, 1998 తరువాత 32 జట్లకూ ఫిఫా ప్రపంచకప్ లో చోటు కల్పించడంతో పాటు ఆఫ్రికా, ఆసియా, ఉత్తరమెరికా లకూ పాల్గొనే వీలు కల్పించారు. వేర్వేరు సంవత్సరాలలో - మెక్సికో, కొరియా సెనెగల్, యూఎస్ఏ, ఘనా వంటి జట్లు స్పర్థాపాదస్థాయి (క్వార్టర్ ఫైనల్స్) వరకూ చేరుకున్నాయి. కానైతే, ఇప్పటికీ యూరోపియన్, దక్షిణమెరికా జట్లే ఫుట్‌బాల్ ఆటలో బలోపేతమైన శక్తులని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

అంతర్జాతీయంగా అత్యంత ఆదరణనందుకునే క్రీడగా ఫుట్‌బాల్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న నేపథ్యంలో 2002 ప్రపంచ కప్ లో పాల్గొనడానికి 200 దేశాలు, 2006 లో 198 దేశాలు బరొలోకి దిగితే, 2010 పోటీలకు ముందెన్నడూ లేనట్లుగా 204 దేశాలు ఆసక్తి కనబరచాయి.[2]

బహుమతి

మార్చు

1930 నుండి 1970 వరకూ ప్రపంచ ఫుట్‌బాల్ విజేతలకు చేతులు మారే కప్పు ఇచ్చేవారు - 1946లో మొదటి ఫిఫా అధ్యక్షుని గౌరవార్థం, దీనిని జూల్స్ రిమెట్ బహుమతి అని పేరు మార్చారు. 1970లో మూడవ సారి విజేతలైన బ్రెజిల్, ఈ కప్పును శాశ్వతంగా చేజిక్కించుకుంది. కాని అది 1983లో దొంగల పాలైంది.[3]

1970 లో మొదలుపెట్టి, ఏడు దేశాల ఫిఫా సభ్య నిపుణులు- 53 నమూనాలను బేరీజు వేసి, ఇటాలియన్ రూపకర్త సిల్వియో గజానిగా ప్రతిపాదించిన కొత్త ఫిఫా ప్రపంచ కప్పుకు ఆమోదముద్ర వేశారు. 36 సెం.మీ (14.2 అంగుళాలు) ఎత్తైన 18 కారట్ల (75%) బంగారు జ్ఞాపిక బరువు 6.175 కిలోలుంటుంది. ప్రతీ నాలుగేళ్ళకీ ఇదే కప్పు చేతులు మారుతూ ఉంటుంది. మునుపటి విజేతలకి బంగారు తాపడం చేసిన నకలు ఉంచుకునేలా నిర్ణయం చేసారు.[4]

మొదటి మూడు స్థానాలలో నిలిచిన జట్ల ఆటగాళ్ళు, శిక్షకులు, యజమానులందరికీ ప్రపంచ కప్ బహుమతి చిఱు నమూనాలు గల పతకాలను అంద జేస్తారు. వారి జట్ల స్థానాలను బట్టి ఈ పతకాలు బంగారం, వెండి, లేదా కంచులో ఉంటాయి. 2002 లో నాల్గవ స్థానపు పతకాలను ఆతిథ్యమిచ్చిన దక్షిణ కొరియాకు ఇచ్చారు.

క్రీడల నిర్వహణ

మార్చు

ఉత్తీర్ణతా పోటీలు

మార్చు

1934 నుంచీ అంతిమ క్రీడాస్పర్థను కుంచించే ఉద్దేశంతో ఉత్తీర్ణతా పోటీలు నిర్వహించడం పరిపాటి అయింది. (ప్రతీ ఖండాన్నించీ ఎన్నేసి జట్లను ఎంపిక చేయాలో ఆయా జట్ల బలాబలాననుసరించి ఫిఫా ముందే నిర్ణయిస్తుంది). కడపటి ఆటల ముహూర్తానికి రమారమి మూడేళ్ళ ముందే ఈ ఉత్తీర్ణతా పోటీలు మొదలవుతాయి. ఒకో గుంపులోను కొన్ని జట్లు తమ మునుపటి పాటవం మూలంగా స్వతహాగా కొన్ని స్థాయిల పై మెట్టుమీదకి (ఆడనక్కర లేకుండా). మరికొన్ని ఆ ఉత్తీర్ణతా పోటీలలో పోరాడి ఆస్థానాన్ని చేరుకునే జట్లూ ఉంటాయి.. ఒక్కో ఉపసంఘానికి (కాన్ఫెడరేషన్) నియమాలలో చిన్నచిన్న భేదాలూ ఉంటాయి. 1938-2002 మధ్య ఏర్పరిచిన గతవిజేతల చేర్పు హక్కును ఆ పిమ్మట రద్దు చేసారు. 2006 లో గతవిజేతలైన బ్రెజిల్ మఱలా ఉత్తీర్ణతా పోటీల ద్వారా ప్రవేశించవలసి రావడం ఈ నియమానికి ప్రారంభం.[5]

కడపటి పోటీలు

మార్చు
స్పెయిన్ జాతీయ జట్టు దక్షిణాఫ్రికాలో నిర్వహించిన 2010 క్రీడా స్పర్థ విజేత

ఏదో ఒక పోటీ చేస్తున్న దేశం ఆతిథ్యమిస్తూన్న ప్రస్తుత ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు 32 జట్ల మధ్య నెల్లాళ్ళ పాటు జరుగుతాయి. వీటిలో 8 గుంపుల్లో నాలుగేసి చొప్పున జట్లు తమ గుంపులోని అన్ని ఇతర జట్లతోనూ ఆడతాయి. ఇక్కడ సాధించిన గుణాల ఆధారంగా ప్రతి గుంపు నుండి రెండేసి ఉత్తమ జట్లు తరువాతి స్థాయికి చేరుతాయి. ఇతర క్రీడలలోలాగే ఈ స్థాయిలో ఓడించి ముందుకు సాగే పద్ధతి (knockout)లో ఆటలు సాగుతాయి. [6]

ప్రతి గుంపులోనూ రెండింటికన్నా ఎక్కువ యూరోపియన్ జట్లుగాని, మరే ఇతర ప్రాంతంనుండి ఒకటి కన్నా ఎక్కువ జట్టుగాని లేకుండా సమ ఉజ్జీలను బరిలోకి దింపడం కూడా ఆనవాయితీగా వస్తోంది. గుంపులో జట్ల గుణగణాలని ఈ క్రింది ప్రాతిపదికలపై (ఇచ్చిన వరుసలో) నిర్ధారిస్తారు:[7]

  1. అత్యధిక గుణాలు సంపాదించిన జట్టు
  2. సాధించిన/వదిలేసిన లక్ష్యాల (గోల్స్) సంఖ్యలో అత్యధిక భేదం కనబరచిన జట్టు
  3. అత్యధిక సంఖ్యలో లక్ష్యాలు సాధించిన జట్టు
  4. పై విషయాలననుసరించినా ఒకటి కన్న ఎక్కువ జట్లు సమాన తూకంలో ఉంటేగనుక ఇవే ప్రాతిపదికలను ఇదే వరుసలో అలా సమతూకంలో ఉన్న జట్లమధ్య పరస్పర పోటిలలో అన్వయించి, విజేతలను నిర్ణయిస్తారు. అప్పటికీ సరిసమానంగా ఉన్నచో చీటీలు తీసి ఒకరిని తరువాతి స్థాయికి పంపటం జరుగుతుంది.

గెలుపో,బయిటికో అన్నట్టుగా సాగే తరువాతి స్థాయిలో ఆట ఆటకీ ఒకొక్క జట్టు నిష్క్రమించితీరాల్సిందే. అవసరమైతే అధిక కాలావధి, ఆ పై పరిహార నిర్ణయం (penalty shootout) ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. ఒకొక్క గుంపులో విజేత మరో గుంపులో రన్నర్స్-అప్లతో 16 జట్ల మధ్య 8 పోటీలు మొదట జరుగుతాయి. ఇలా వచ్చిన 8 విజేతల మధ్య జరిగే తరువాతి ఆవృతాన్ని స్పర్థాపాద స్థాయి (quarter-finals) అనీ, అటుతర్వాతి 4 జట్ల మధ్య జరిగే పోటీలను స్పర్థార్ధస్థాయి (semi-finals) అనీ అంటారు. చివరికి జరిగే స్పర్థాంతిమ స్థాయి (final) పోటీకి ముందు, ఓడిన అర్ధవిజేతల మధ్య 3వ స్థానానికి కూడా పోటీ జరుగుతుంది.

ఆతిథ్య దేశాలు

మార్చు

ఎంపిక పద్ధతి

మార్చు

1930 లో ఉరుగ్వేలోనూ తరువాతి రెండు మార్లూ ఐరోపా లోనూ ఈ ప్రపంచ కప్ పోటీలను నిర్వహించడం వాదోపవాదాలకూ, అనేక దేశాలు ఫిఫా ఇష్టానుసార నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆటలను బహిష్కరించడానికీ దారితీసాయి.

1958 తరువాత ఇలాటి అపోహలకు తావీయకుండా, ఏకాంతరంగా అమెరికా, ఐరోపా ల మధ్య ఈ పోటీలను నిర్వహించే సంప్రదాయాన్ని ఫిఫా పాటిస్తూ వచ్చింది. 2002 లో జపాన్, కొరియాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీలు ఆసియాలో ప్రప్రథమమే కాక, వేర్వేరు దేశాలు సంయుక్తంగా నిర్వహించడానికి కూడా శ్రీకారం చుట్టాయి.[8] 2010 లో ఆతిథ్యమిచ్చిన దక్షిణాఫ్రికా ఆఫ్రికాలో ఈ హోదా పొందిన మొదటి దేశం. 2014 లో బ్రెజిల్ లో జరిగిన ప్రపంచ కప్, 1978 తరువాత దక్షిణ అమెరికా ఖండంలో 36 యేళ్ల తరువాత జరిగినవి. 3 సార్లు ఐరోపా బయట ఈ పోటీలు వరుసగా జరగడం కూడా ఇదే మొదటిసారి.

ఆతిథ్యమిచ్చే దేశాన్ని ఫిఫా కార్యనిర్వాహక సమితి ఎన్నికల ద్వారా ఎంపిక చేయడం ప్రస్తుతం పాటిస్తున్న పద్ధతి. ఈ ఆసక్తి కల దేశాలు ఫిఫా నియమ నిబంధనలు, ముందస్తు ఏర్పాట్లు పాటించగలమని హామీ ఇచ్చి, పిమ్మట నిరూపించుకోవలసి ఉంటుంది.ఆరేడేళ్ళ ముందే ఈ దేశాలను నిర్ణయించడం కద్దు. కొన్ని సార్లు తరువాతిదే కాక అటు తర్వాతి వేదికలను కూడా ముందుగానే ఫిఫా నిర్ణయిస్తుంది. 2018, 2022 ప్రపంచ కప్పులు, రష్యా, ఖతార్ ల వేదికలకు ఇలాగే నిశ్చయించారు.

పాటవ ప్రదర్శన

మార్చు

ఇంత వరకూ ఫుట్‌బాల్ ప్రపంచ కప్ గెలిచిన 8 దేశాలలో 6 దేశాలు తమ స్వంత గడ్డ మీదే గెలవడం విశేషం. ఇంగ్లాండ్ (1966) లోనూ ఫ్రాన్స్ (1998) గెలిచిన ప్రపంచ కప్పులు ఈ రెండుదేశాలకూ స్వదేశాలలో చిక్కినవే. ఇందుకు భిన్నంగా 1950 లో ఉరుగ్వే చేతిలో అంతిమ పోటీలో ఆతిథ్యమిస్తున్నబ్రెజిల్ ఓడిపోగా, 1982 లోస్పెయిన్, తమ దేశంలో పోటీలకు ఆతిథ్యమిస్తూ రెండవ చుట్టు పోటీలే దాటలేక పోయింది.ఉరుగ్వే (1930) లోనూ, ఇటలీ (1934) లోనూ అర్జెంటీనా (1978) లోనూ ఆతిథ్యమిస్తూ తమ తొలి ప్రపంచ కప్పులు సాధించినా, అటు పిమ్మట బయట కూడా గెలిచి తమ సత్తా చాటుకున్నాయి. జర్మనీ (1974) లో స్వంత గడ్డ మీద రెండవసారి ప్రపంచ కప్ గెలుచుకుంది.

అంతిమ విజేతలు కాలేక పోయినా స్వీడన్ (1958) లో మలి విజేత గానూ, చిలీ (1962) లో మూడవ స్థానంలోనూ, దక్షిణ కొరియా (2002), బ్రెజిల్ (2014) లలో నాల్గవ స్థానంలోనూ, మెక్సికో 1970, 1986 లలో ఆతిథ్యమిస్తూ పాదవిజేతల స్థాయి లోనూ నిలిచి, ఆతిథ్యమిస్తున్న దేశాల ప్రాభవాన్ని, స్థానబలిమిని నిరూపించాయి. 2010 లోదక్షిణాఫ్రికా ఒక్కటే ప్రపంచ కప్ ఫుట్‌బాల్లో మొదటిచుట్టు దాటలేక పోయిన ఆతిథ్య దేశం.

నిర్వహణ, మాధ్యమ ప్రసారణం

మార్చు

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఆటలపోటీలను దూరదర్శినిలో చూపడం 1954 నించే ఆచారంగా వస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ ని మించి, అత్యధికులు చూస్తున్న ఒకే ఒక ఆటలపోటీ ఫిఫా ప్రపంచ కప్. 2006 లోని ప్రపంచ కప్ అన్ని ఆటలూ కలిపి 2600 కోట్ల మంది ప్రేక్షకులు చూసి ఉంటారని అంచనా. [9] ఆ సంవత్సరం పోటీళ ఫైనల్ మ్యాచ్‌ని 71.51 కోట్ల మంది చూసారు. (నాటి ప్రపంచ జనాభాలో దాదాపు పదకొండవ వంతు). కోకా కోలా, మెక్ డోనాల్డ్స్, అడిడాస్ లాంటి అనేక అంతర్జాతీయ కంపెనీలకి తమ ముద్రాచిహ్నాలకి గుర్తింపు పెంచుకునే గొప్ప సదవకాశం, ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు. ఆతిథ్యమిస్తున్న దేశాలు ఈ నెల్లాళ్ళ ఆటల పండుగల్లో తమ పర్యాటనా రంగ ఆదాయాన్ని కూడా ఆకాశ స్థాయికి ఎదగడం చూస్తాయనడంలో సందేహం లేదు. 2014 ప్రపంచ కప్ నిర్వహిస్తున్న బ్రెజిల్ 1100 కోట్ల డాలర్ల ఆదాయాన్ని గడిస్తుందని అంచనా.

1966 నుండి ప్రతి ఫిఫా ప్రపంచ కప్ కీ తమ తమ ముద్ర గానీ or చిహ్నం గానీ ఉండటం ఆనవాయితీగా వస్తోంది.

హాజరయిన ప్రజల సంఖ్య

మార్చు
ఆతిథ్యదేశం & యేడాదిమొత్తం హాజరుఆటల సంఖ్యసగటు హాజరు, ఆటకి.
ఉరుగ్వే 19305,90,5491832,808
ఇటలీ 19343,63,0001721,353
ఫ్రాన్స్ 19383,75,7001820,872
బ్రెజిల్ 195010,45,2462247,511
స్విట్జర్లాండ్ 19547,68,6072629,562
స్వీడన్ 19588,19,8103523,423
చిలీ 19628,93,1723227,912
ఇంగ్లాండ్ 196615,63,1353248,848
మెక్సికో 197016,03,9753250,124
జర్మనీ 197418,65,7533849,099
అర్జెంటీనా 197815,45,7913840,679
స్పెయిన్ 198221,09,7235240,572
మెక్సికో 198623,94,0315246,039
ఇటలీ 199025,16,2155248,389
అమెరికా 199435,87,5385268,991
ఫ్రాన్స్ 199827,85,1006443,517
దక్షిణ కొరియా 200227,05,1976442,269
జర్మనీ 200633,59,4396452,491
దక్షిణాఫ్రికా 201031,78,8566449,670
బ్రెజిల్ 201434,29,8736453,592
రష్యా 201830,31,7686447,371
ఖతార్ 202234,04,2526453,191
మొత్తం4,39,36,73096442,649

ఫలితాలు

మార్చు

ఒలింపిక్ పోటీల్లో భాగంగా

మార్చు

ఒలింపిక్ పోటీల్లో భాగంగా జరిగిన పోటీలు. ఫిఫా ఈ పోటీలను ఫుట్‌బాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్పుగా గుర్తించింది.

ఒలింపిక్ పోటీల్లో భాగంగా జరిగిన పోటీలు.
యేడాదిఆతిథ్యదేశంఫైనల్ పోటీమూడవ స్థానానికి పోటీ
విజేతఫలితంరన్నర్స్-అప్మూడవ స్థానంఫలితంనాల్గవ స్థానం
1920 ఉరుగ్వే
ఉరుగ్వేఉరుగ్వే
4-3 అర్జెంటీనా అ.సం.రాజరగలేదు యుగోస్లావియా
1924 ఇటలీ ఇటలీ2-1 చెకోస్లోవేకియా జర్మనీ3-1 ఆస్ట్రియా
1928 ఫ్రాన్స్ ఇటలీ4-3 హంగరీ బ్రెజిల్4-2 స్వీడన్

ఫిఫా ప్రపంచ కప్

మార్చు

ఫిఫా ప్రపంచ కప్ పోటీలు. ఒలింపిక్ పోటీలకు బయట, ప్రస్తుత రూపంలో ఫిఫా అధికారికంగా నిర్వహిస్తున్న ప్రపంచ కప్ పోటీలు

ఫిఫా ప్రపంచ కప్ పోటీలు
టోర్నమెంటు

సంఖ్య

యేడాదిఆతిథ్యదేశంఫైనల్ పోటీమూడవ స్థానానికి పోటీపాల్గొన్న జట్లు
విజేతఫలితంరన్నర్స్-అప్మూడవ స్థానంఫలితంనాల్గవ స్థానం
11930  Uruguay
ఉరుగ్వే
4-2
అర్జెంటీనా

United States
[n 1]

Yugoslavia
13
21934  Italy
ఇటలీ
2-1
Czechoslovakia

జర్మనీ
3-2
ఆస్ట్రియా
16
31938  France
ఇటలీ
4-2
హంగరీ

బ్రెజిల్
4-2
Sweden
15
1942రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా జరగలేదు
1946రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా జరగలేదు
41950 బ్రెజిల్ ఉరుగ్వే2-1 [n 2] బ్రెజిల్ స్వీడన్3-1 [n 2] స్పెయిన్13
51954 స్విట్జెర్లాండ్ పశ్చిమ జర్మనీ3-2 హంగరీ ఆస్ట్రియా3-1 ఉరుగ్వే16
61958 స్వీడన్ బ్రెజిల్5-2 స్వీడన్ ఫ్రాన్స్6-2 పశ్చిమ జర్మనీ16
71962 చిలీ బ్రెజిల్3-1 చెకోస్లోవేకియా చిలీ1-0 యుగోస్లావియా16
81966 ఇంగ్లాండ్ ఇంగ్లాండ్4-2 పశ్చిమ జర్మనీ పోర్చుగల్2-1 సోవియట్ యూనియన్16
91970 మెక్సికో బ్రెజిల్4-1 ఇటలీ పశ్చిమ జర్మనీ1-0 ఉరుగ్వే16
101974 పశ్చిమ జర్మనీ పశ్చిమ జర్మనీ2-1 నెదర్లాండ్స్ పోలెండ్1-0 బ్రెజిల్16
111978 అర్జెంటీనా అర్జెంటీనా3-1 నెదర్లాండ్స్ బ్రెజిల్2-1 ఇటలీ16
121982 స్పెయిన్ ఇటలీ3-1 పశ్చిమ జర్మనీ పోలెండ్3-2 ఫ్రాన్స్24
131986 మెక్సికో అర్జెంటీనా3-2 పశ్చిమ జర్మనీ ఫ్రాన్స్4-2 బెల్జియమ్24
141990 ఇటలీ పశ్చిమ జర్మనీ1-0 అర్జెంటీనా ఇటలీ2-1 ఇంగ్లాండ్24
151994 అ.సం.రా బ్రెజిల్0-0 ఇటలీ స్వీడన్4-0 బల్గేరియా24
161998 ఫ్రాన్స్ ఫ్రాన్స్3-0 బ్రెజిల్ క్రోయేషియా2-1 నెదర్లాండ్స్32
172002 దక్షిణ కొరియా,

జపాన్

బ్రెజిల్2-0 జర్మనీ టర్కీ3-2 దక్షిణ కొరియా32
182006 జర్మనీ ఇటలీ1-1 ఫ్రాన్స్ జర్మనీ3-1 పోర్చుగల్32
192010 దక్షిణాఫ్రికా స్పెయిన్1-0 నెదర్లాండ్స్ జర్మనీ3-2 ఉరుగ్వే32
202014 బ్రెజిల్ జర్మనీ1-0 అర్జెంటీనా నెదర్లాండ్స్3-0 బ్రెజిల్32
212018  Russia
ఫ్రాన్స్
క్రోయేషియా 2-0 ఇంగ్లాండ్32
222022 ఖతార్ అర్జెంటీనా3-3 (4-2)
ఫ్రాన్స్
క్రోయేషియా2-1  మొరాకో32
232026 కెనడా మెక్సికో అమెరికా48


ప్రపంచ కప్ లో వివిధ దేశాల స్థానం

మార్చు
దేశంవిజేతరన్నర్స్-అప్మూడవ స్థానంనాల్గవ స్థానం
బ్రెజిల్5 (1958, 1962, 1970, 1994, 2002)2 (1950*, 1998)2 (1938, 1978)2 (1974, 2014)
జర్మనీ4 (1954, 1974, 1990, 2014)4 (1966, 1982, 1986, 2002)4 (1934, 1970, 2006,2010)1 (1958)
ఇటలీ4 (1934, 1938, 1982, 2006)2 (1970, 1994)1 (1990)1 (1978)
అర్జెంటీనా3 (1978, 1986, 2022)3 (1930, 1990, 2014)....
ఉరుగ్వే2 (1930, 1950)....3 (1954, 1970,2010)
ఫ్రాన్స్2 (1998,2018)2 (2006, 2022)2 (1958, 1986)1 (1952)
ఇంగ్లాండ్1 (1966)....2 (1990, 2018)
స్పెయిన్1 (2010)....1 (1950)
నెదర్లాండ్స్..3 (1974, 1978,2010)1 (2014)1 (1998)
చెకోస్లోవేకియా..2 (1934, 1962)....
హంగరీ..2 (1938, 1954)....
స్వీడన్..1 (1958*)2 (1950, 1994)1 (1938)
క్రోయేషియా..1 (2018)2 (1998, 2022)
పోలెండ్....2 (1974, 1982)..
ఆస్ట్రియా....1 (1954)1 (1934)
పోర్చుగల్....1 (1966)1 (2006)
యుగోస్లావియా....2 (1930, 1962)
అ.సం.రా.....1 (1930)..
చిలీ....1 (1962)..
టర్కీ....1 (2002)..
సోవియట్ యూనియన్ లేదా రష్యా......1 (1966)
బెల్జియమ్....1 (2018)1 (1986)
బల్గేరియా......1 (1994)
దక్షిణ కొరియా......1 (2002*)
 మొరాకో......1 (2022)

బిరుదులు

మార్చు

ప్రతి విడత ప్రపంచ కప్ పోటీల అనంతరం, జట్లకీ, ఆటగాళ్ళకీ కొన్ని బిరుదులు ప్రదానం చేస్తారు. ప్రస్తుతం ఇలాటి 6 బిరుదులు ఉన్నాయి:[13]

  • బంగారు బంతి ప్రసార మాధ్యమాల ప్రతినిధులు ఎన్నుకున్న అత్యుత్తమ ఆటగానికి (1982 నుండి); వెండి బంతి, కంచు బంతి రెండవ, మూడవ స్థానాలలో నిలిచిన అటగాళ్ళకు;[14]
  • బంగారు పాదరక్ష అత్యధిక లక్ష్యాలు (గోల్స్) సాధించిన ఆటగానికి ; అలాగే రజత పాదరక్ష, కాంశ్య పాదరక్ష రెండు, మూడు స్థానాలలో నిలిచిన లక్ష్య సాధకులకి;[15]
  • బంగారు చేయి అత్యుత్తమ లక్ష్య రక్షకుడికి (గోల్ కీపర్), ఫిఫా సాంకేతిక అధ్యయనా మండలి నిర్ణయం మేఱకు (1994 నుండి ప్రారంభం);[16]
  • ఉత్తమ పిన్నవయస్కుడైన ఆటగాడు 21 యేళ్ళకు పై బడని ఆటగానికి (ఫిఫా సాంకేతిక అధ్యయనా మండలి నిర్ణయం మేఱకు‌) (2006 లో మొదలయినది).[17]
  • ఫిఫా నైతిక స్పూర్తి (ఫెయిర్ ప్లే) బిరుదు క్రీడా నైతిక స్ఫూర్తిని ప్రదర్శించిన అత్యుత్తమ జట్టుకు (1978 నుండి);[17]
  • వినోదదాయక జట్టు బిరుదు, జనబాహుళ్యం ఎన్నుకున్న- జనాన్ని వినోదపఱచిన అత్యుత్తమ జట్టుకు (1994 నుండి);[17]

సర్వ శ్రేయ జట్టు పాల్గొన్న అందరు ఆటగాళ్ళలోనూ ఎన్నుకునే అత్యుత్తమ ఊహాజనిత జట్టుకు (1998 నుండి).

రికార్డులు, నమోదులు

మార్చు

మెక్సికోకు చెందిన ఆంటోనియో కార్బజోల్ (1950–1966), జర్మనీ ఆటగాడు లోథార్ మథియాస్ (1982–1998) ఇద్దరూ ఐదేసి ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొని, అత్యధిక సార్లు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్ళుగా నమోదయ్యారు.[18] 25 ప్రపంచ కప్ ఆటలో ఆడిన మథియాస్ ఆటల సంఖ్యలో అత్యధికుడిగా నమోదయ్యాడు..[19] పశ్చిమ జర్మనీకి చెందిన ఫ్రాంజ్ బెకెన్ బాయర్ (1966–1974) మూడు అంతిమ పోటీలలో ఆడిన ఏకైక ఆటగాడు.

(1998–2006) మధ్య 15 ప్రపంచ కప్ ఆటల గోల్స్ ఛేదించిన ఆటగాడు బ్రెజిల్ కి చెందిన రోనాల్డో మొత్తం మీద అత్యధిక లక్ష్యాలు. జర్మనీకి చెందిన మిరోస్లావ్ క్లోస్ (2002–2010), పశ్చిమ జర్మనీకి ఆడినగెర్డ్ మ్యూలర్ (1970–1974) 15 గోల్స్ తో రెండవస్థానంలో ఉన్నారు.[20] నాలుగవ స్థానంలో తన ఏకైక 1958 ప్రపంచ కప్ లో 13 గోల్స్ సాధించిన ఘనత వహించిన ఆటగాడు ఫ్రాన్స్ దేశస్థుడైన జస్ట్ ఫోన్టైన్.[21]

ఆటగాని గానే కాక, అటు పిమ్మటి విడతల్లో శిక్షకుని పాత్రలో కూడా ప్రపంచ కప్ సంపాదించిన గౌరవం బ్రెజిల్ కు చెందిన మారియో చగల్లో, పశ్చిమ జర్మనీకి చెందిన ఫ్రాంజ్ బెకెన్ బాయర్ లకు మాత్రమే దక్కింది.

జాతీయ జట్లలో అత్యధిక ప్రపంచ కప్ ఫుట్‌బాల్ ఆటలు 99 ఆడినది జర్మనీ దేశమే..[22] 210 అత్యధిక లక్ష్యాలను ఛేదించినది మాత్రం బ్రెజిల్.[23] ఈ రెండు దేశాలూ కేవలం 2002 చివరి పోటీ లో ఒకే ఒకసారి ముఖాముఖి తలపడ్డాయి.

గమనికలు

మార్చు
  1. మూడో స్థానానికి పోటీ జరగలేదు; సెమీ ఫైనల్లో ఓడిపోయిన రెండూ జట్లు టోర్నమెంటులో ఆడిన మ్యాచ్‌లలో వాటి ప్రదర్శనను బట్టి వాటి ర్యాంకులను నిర్ణయించారు.[11]
  2. 2.0 2.1 1950 లో జరిగిన పోటీలు రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగాయి. యాదృచ్ఛికంగా, చివరి రెండు మాచ్‌లలో ఒకటి అగ్రస్థానంలో ఉన్న రెండు జట్ల మధ్య జరిగింది (కప్పును గెలుచుకోదగ్గ జట్లే ఆ రెండూ). రెండోది అట్టడుగున ఉన్న రెండు జట్ల మధ్య జరిగింది. ఉరుగ్వే బ్రెజిల్‌ల మధ్య జరిగిన పోటీని 1950 ప్రపంచ కప్‌కు ఫైనల్ పోటీగా భావిస్తారు. [12]

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు
🔥 Top keywords: అన్నదాత సుఖీభవ పథకంమొదటి పేజీవాతావరణంనారా చంద్రబాబునాయుడుప్రత్యేక:అన్వేషణమాదక ద్రవ్యాలుభారత అత్యవసర స్థితివంగ‌ల‌పూడి అనితఈనాడుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగువై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలుగు అక్షరాలుకాట ఆమ్రపాలిప్రత్యేక:ఇటీవలిమార్పులుపాలస్తీనాశారదగాయత్రీ మంత్రంమహాత్మా గాంధీఅఖిల భారతీయ విద్యార్థి పరిషత్తుటి.జీవన్ రెడ్డినాగ్ అశ్విన్సంకటహర చతుర్థిమహాభారతంనక్షత్రం (జ్యోతిషం)అన్నాలెజినోవాఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాలోక్‌సభ స్పీకర్చింతకాయల అయ్యన్న పాత్రుడుపవన్ కళ్యాణ్ప్రతిపక్ష నాయకుడురామాయణంభారత రాజ్యాంగంఅంగుళంకల్క్యావతారముభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువికీపీడియా:Contact usఆంధ్రప్రదేశ్అశ్వత్థామ