రెండు రెళ్ళు ఆరు

రెండు రెళ్ళు ఆరు రాజేంద్రప్రసాద్, ప్రీతి, చంద్రమోహన్, రజని ప్రధాన పాత్రలలో నటించిన తెలుగు సినిమా. జంధ్యాల దర్శకత్వంలో విజయ కమర్షియల్స్ బ్యానర్‌పై జి.సుబ్బారావు నిర్మించిన ఈ సినిమా 1986, జనవరి 11వ తేదీన విడుదలయ్యింది.

రెండు రెళ్ళ ఆరు
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం జంధ్యాల
తారాగణం చంద్రమోహన్ ,
రజని,
రాజేంద్ర ప్రసాద్,
ప్రీతి
సంగీతం రాజన్ - నాగేంద్ర
నిర్మాణ సంస్థ విజయ కమర్షియల్స్
భాష తెలుగు

పాత్రలు - పాత్రధారులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

సంక్షిప్త కథ

మార్చు

మధుసూదనరావు(Mad), సద్గుణరావు (Sad) ఇద్దరూ మంచి రూమ్మేట్స్. ఒక సినిమా థియేటర్‌లో పరిచయమైన కీర్తనను గాఢంగా ప్రేమిస్తాడు మధుసూదనరావు(రాజేంద్ర ప్రసాద్). కీర్తన (ప్రీతి), వింధ్య (రజని) ఒకే హాస్టల్‌లో ఉంటారు. మధుసూదనరావు అసలు పేరు వెంకటశివం. కీర్తన అసలు పేరు విఘ్నేశ్వరి. వెంకటశివం, విఘ్నేశ్వరి లకు ఇష్టం లేకుండానే చిన్న వయసులోనే పెళ్లి అయిపోతుంది. తల్లిదండ్రుల ఉద్యోగరీత్యా ఇద్దరూ చిన్న వయసులోనే వేరుపడిపోతారు. విఘ్నేశ్వరి పెద్దనాన్న సర్వానందం (పుచ్చా పూర్ణానందం) ఎన్నోసార్లు ఊరు రమ్మంటాడు. విఘ్నేశ్వరి స్థానంలో వింధ్య, వెంకటశివం స్థానంలో సద్గుణరావు(చంద్రమోహన్) మంగళగిరి వెళ్తారు. అక్కడ ఇద్దరూ ద్వేషిస్తున్నట్లు నటిస్తూనే మనసులో ప్రేమ పెంచుకుంటారు. ఇంట్లో వాళ్లకి వీళ్ళిద్దరూ అసలు వారు కాదని తెలిసి కంగారు పడతారు. చివరికి మధుసూదనరావు - కీర్తన, సద్గుణరావు - వింధ్య ఒక్కటవుతారు.[1]

పాటలు

మార్చు

ఈ సినిమాలో మూడు పాటలున్నాయి. ఈ మూడు పాటలను వేటూరి సుందరరామమూర్తి వ్రాయగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి పాడారు. ఈ పాటలకు రాజన్-నాగేంద్ర బాణీలు కట్టారు.

పాటల జాబితా
సం.పాటనటీనటులుపాట నిడివి
1."కాస్తందుకో... దరఖాస్తందుకో..."రాజేంద్రప్రసాద్, ప్రీతి 
2."జోహారు పెళ్ళామా"చంద్రమోహన్, రజని 
3."విరహవీణ నిదురరాక వేగే వేళలో..."రజని, చంద్రమోహన్ 

మూలాలు

మార్చు
  1. పులగం చిన్నారాయణ (1 October 2004). "జంధ్యామారుతం" (PDF). హాసం - హాస్య సంగీత పత్రిక. 4 (73): 24–30. Retrieved 1 April 2018.[permanent dead link]
🔥 Top keywords: అశ్వత్థామమొదటి పేజీమహాభారతంకర్ణుడునాగ్ అశ్విన్ప్రత్యేక:అన్వేషణకల్క్యావతారముచదలవాడ ఉమేశ్ చంద్రజాతీయ వైద్యుల దినోత్సవంనారా చంద్రబాబునాయుడుసప్త చిరంజీవులుకల్కి 2898 ఏ.డీఈనాడుభజే వాయు వేగంమహాత్మా గాంధీపాండవులుఅన్నదాత సుఖీభవ పథకంఆంధ్రప్రదేశ్బిధాన్ చంద్ర రాయ్తెలుగుభీష్ముడుతెలుగు అక్షరాలురామాయణంశ్రీ కృష్ణుడురామావతారంసెక్స్ (అయోమయ నివృత్తి)ప్రియాంక దత్ఏ.పి.జె. అబ్దుల్ కలామ్రోహిత్ శర్మబలి చక్రవర్తిపాతాళ భైరవి (సినిమా)అల్లూరి సీతారామరాజుఛత్రపతి శివాజీకె.మాలతిబి.ఆర్. అంబేద్కర్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీనక్షత్రం (జ్యోతిషం)విరాట్ కోహ్లి