హిసార్

హర్యానా రాష్ట్రం లోని పట్టణం

హిసార్ హర్యానా రాష్ట్రం లోని పట్టణం. ఇది హిసార్ జిల్లా ముఖ్య పట్టణం, హిసార్ రెవెన్యూ డివిజను కేంద్రం కూడా. హిసార్, భారత రాజధాని న్యూ ఢిల్లీకి పశ్చిమాన 164 కి.మీ. దూరంలో ఉంది. ఢిల్లీకి ప్రత్యామ్నాయ అభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చెయ్యడానికి ఈ నగరాన్ని గుర్తించారు.

హిసార్
నగరం
పైనుండి సవ్యదిశలో: జిల్లా పాలనా కార్యాలయాఅలు, సెంట్ థాంస్ చర్చి, ఫిరోజ్ షా కోట, శీతలా మాత ఆలయం, ఓపి జిందల్ జ్ఞాన కేంద్రం వద్ద వేధశాల
పైనుండి సవ్యదిశలో: జిల్లా పాలనా కార్యాలయాలు, సెంట్ థామస్ చర్చి, ఫిరోజ్ షా కోట, శీతలామాత ఆలయం, ఓపి జిందల్ జ్ఞాన కేంద్రం వద్ద నున్న వేధశాల
Nickname(s): 
ఉక్కు నగరం
విద్యల నగరం
హిసార్ is located in Haryana
హిసార్
హిసార్
Coordinates: 29°09′N 75°42′E / 29.150°N 75.700°E / 29.150; 75.700
దేశంభారతదేశం
రాష్ట్రంహర్యాణా
జిల్లాహిసార్[1]
డివిజనుహిసార్
Government
 • BodyMunicipal Corporation of Hisar
Elevation
215 మీ (705 అ.)
జనాభా
 (2011)
 • Total3,01,249
 • Rank141[2]
భాషలు[3][4]
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
125001
UNLOCODE
IN HSS
టెలిఫోన్ కోడ్91-1662 xxx xxx
Vehicle registrationHR-20, HR-39
దగ్గర లోని నగరంన్యూ ఢిల్లీ
Website

ఈ నగరాన్ని క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో మౌర్యులు, 14 వ శతాబ్దంలో తుగ్లక్, 16 వ శతాబ్దంలో మొగలులు, 19 వ శతాబ్దంలో బ్రిటిషు వారు పాలించారు. స్వాతంత్ర్యం తరువాత, ఇది పంజాబ్ రాష్ట్రంలో కలిసింది. 1966 లో పంజాబ్‌ను విభజించినప్పుడు హిసార్, హర్యానాలో భాగమైంది.

1351 నుండి 1388 వరకు ఢిల్లీ సుల్తానుగా ఉన్న ఫిరోజ్ షా తుగ్లక్ సా.శ. 1354 లో దీనికి హిసార్-ఎ-ఫిరోజా అనే ప్రస్తుత పేరు పెట్టాడు. ఘగ్గర్, దృషద్వతి అనే నదులు ఒకప్పుడు నగరం గుండా ప్రవహించేవి. కాని ఇప్పుడు వాటి మార్గం మారిపోయింది. హిసార్‌లో చాలా వేడిగా ఉండే వేసవి కాలం, సాపేక్షంగా చల్లగా ఉండే శీతాకాలాలతో ఖండాంతర శీతోష్ణస్థితి ఉంటుంది.

చరిత్ర

మార్చు

ప్రారంభ చరిత్ర

మార్చు

సమీపంలోని రాఖీగఢీ, సిస్వాల్, లోహారీ రాఘోలలో చేసిన పురావస్తు త్రవ్వకాల్లో కనుగొన్న ఆధారాలను బట్టి హరప్పా నాగరికత కాలం నుండి ఈ ప్రాంతంలో మానవ నివాసాలు ఉన్నాయని తెలుస్తోంది. తరువాత, ఆర్యులు దృషద్వతి నది వెంట స్థిరపడ్డారు. జైన సాహిత్యమైన ఉత్తరాధాయన సూత్రంలో కురు దేశంలోని ఇసుకర అనే పట్టణం గురించిన ప్రస్తావన ఉంది. ఇది హిసార్‌కు పూర్వపు పేరు అని భావిస్తున్నారు.[5] హిసార్ రాజ్యానికి రాజధాని అగ్రోహా. గ్రీకులకు వ్యతిరేకంగా చంద్రగుప్త మౌర్యుడు చేసిన యుద్ధంలో హిసార్ రాజ్యం అతడికి సహాయపడి ఉండవచ్చు.[6] నగరం సమీపంలో అశోకుడి స్తంభాలను కనుగొన్నారు. ఈ రాజ్యం మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేదనడానికి ఇది ఋజువుగా భావిస్తున్నారు. తరువాత ఈ నగరం కుషాణు సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యాల క్రిందకు వచ్చింది. 12 వ శతాబ్దంలో పృథ్వీరాజ్ చౌహాన్, ప్రస్తుత హిసార్ జిల్లాలో ఉన్న హన్సీని తన రాజధానిగా చేసుకుని అక్కడ ఒక కోటను నిర్మించాడు.[7] రెండవ తరాయిన్ యుద్ధంలో పృథ్వీరాజును ముహమ్మద్ ఘోరి ఓడించే వరకూ ఇది చౌహాన్ సామ్రాజ్యంలో ఒక వ్యూహాత్మక స్థానంగా ఉండేది.

తుగ్లక్ శకం

మార్చు
సా.శ. 1354 లో హిసార్ వద్ద ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించిన కోట

1351 నుండి 1388 వరకు ఢిల్లీ సుల్తానుగా ఉన్న ఫిరోజ్ షా తుగ్లక్, సా.శ. 1354 లో హిసార్ ను 'హిసార్-ఎ-ఫిరోజా' గా స్థాపించాడు.[8][9] హిసార్-ఎ-ఫిరోజా అంటే పర్షియన్ భాషలో ఫిరోజ్ కోట అని అర్థం. తూర్పున ఢిల్లీ గేట్, మోరి గేట్, దక్షిణాన నాగోరి గేట్, పశ్చిమాన తలాకి గేట్ అనే నాలుగు ద్వారాలతో కోటను నిర్మించాడు. ఈ కోట నిర్మాణం సా.శ. 1354 లో మొదలై సా.శ. 1356 లో పూర్తయింది.[10] కోట మధ్యలో ఫిరోజ్ షా ప్యాలెస్ ఉంది. అనేక భూగర్భ నివాసాలతో పాటు, ఈ కోటలో బారాదరి, లాట్ కి మసీదు, దివాన్-ఎ-ఆమ్, షాహి దర్వాజా వంటి భవనాలున్నాయి.[6] రాజభవనానికి దగ్గరలో చక్రవర్తి తన భార్య గుజ్రీ కోసం నిర్మించిన గుజ్రీ మహల్ ఉంది. క్రీస్తుశకం 1398 లో తైమూర్, ఈ నగరంపై దాడి చేసాడు. అతని సైనికులు కోటకు నిప్పంటించారు.

ఈ నగరం సయ్యద్ రాజవంశం అధికారం లోకి, ఆతరువాత లోడీల పాలనలోకీ వెళ్ళింది.[6] మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్, ఇబ్రహీం లోడిని ఓడించడంతో నగరం మొగలుల ఆధిపత్యం లోకి వెళ్ళింది.

1524–1526లో బాబర్ భారతదేశంపై దాడి చేసినప్పుడు, హిసార్ ఇబ్రహీం లోడి సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.[6] 1526 లో పానిపట్ యుద్ధ సమయంలో బాబరు సైన్యం సిర్హింద్ నుండి ముందుకు సాగకుండా, హిసార్‌లో ఉన్న లోడీ సేనాధిపతి హమీద్ ఖాన్ ససైన్యంగా బాబరు సైన్యన్ని ఎదుర్కొన్నాడు. బాబర్ కొడుకు హుమాయూన్, ఆ సైన్యాన్ని ఓడించి హిసార్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఇందుకు సంతోషించిన బాబరు, హిసార్ నగరాన్ని హుమాయూన్‌కు బహూకరించాడు. 1540 లో షేర్ షా సూరి హుమాయున్‌ను ఓడించినప్పుడు హిసార్ మళ్ళీ చేతులు మారింది. 1555 లో హుమయూన్ మళ్ళీ దానిని కైవసం చేసుకుని అక్బరును పాలకుడిగా నియమించాడు. అక్బర్ పాలనలో (1556-1605) హిసార్ మరోసారి గణనీయమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా మారింది. ఈ నగరం 1760 వరకు మొఘలుల పాలన లోనే ఉంది.

బ్రిటిషు కాలం

మార్చు

హిసార్‌ను 1798 లో జార్జ్ థామస్ అనే ఐరిష్ సాహసికుడు ఆక్రమించాడు. 1801 లో థామస్‌ను మరాఠా సమాఖ్య తరిమివేసింది.[5] ఫ్రెంచి అధికారి, లెఫ్టినెంట్ బోర్క్వియన్, మరాఠాల తరపున ఈ ప్రాంతాలను నియంత్రించాడు. అతను తోహానా, హిస్సార్ పట్టణాలను పునర్నిర్మించాడని ప్రతీతి. ఈ ప్రాంతం 1803 లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోకి వచ్చింది. 1857 వరకు అలాగే కొనసాగింది. 1857 లో సిపాయీల తిరుగుబాటు సమయంలో ముహమ్మద్ అజీమ్, రావు తులా రామ్లు నగరాన్ని కొద్ది కాలం పాటు స్వాధీనం చేసుకున్నారు. 1857 నవంబరు 16 న జనరల్ వాన్ కోర్ట్‌ల్యాండ్ ఆధ్వర్యంలోని కంపెనీ దళాలు అజీమ్, తులా రామ్‌లను ఓడించాయి. 1803, 1879 మధ్య, ఉప్పు, చక్కెరపై కస్టమ్స్ సుంకం వసూలు చేయడానికి బ్రిటిష్ వారు నిర్మించిన 4,000 కిలోమీటర్ల పొడవైన గ్రేట్ హెడ్జ్ ఆఫ్ ఇండియా హిసార్, హన్సీల గుండా పోయింది. హిసార్ 1867 లో మునిసిపాలిటీ అయింది.[11]

స్వాతంత్ర్యం వచ్చాక, హిసార్ పట్టణం పంజాబ్లో భాగమైంది. 1966 లో హర్యాణా ఏర్పడినపుడు ఆ రాష్ట్రంలో భాగమైంది.

భౌగోళికం

మార్చు

హిసార్, హర్యానా పశ్చిమ ప్రాంతంలో, 29°05′N 75°26′E / 29.09°N 75.43°E / 29.09; 75.43 నిర్దేశాంకాల వద్ద ఉంది. సముద్ర మట్టం నుండి దీని ఎత్తు 215 మీటర్లు. ఘగ్గర్ [12] దృషద్వతి [13] నదులు ఒకప్పుడు నగరం గుండా ప్రవహించేవి. టెక్టోనిక్ మ్యాప్ ప్రకారం ఈ జిల్లా, ఢిల్లీ - లాహోర్ రిడ్జి పైన ఉంది. చెప్పుకోదగ్గ భూకంపమేదీ ఈ జోన్‌లో ఉద్భవించలేదు. చరిత్రలో ఒక్కసారి మాత్రమే - 1837–38లో - నగరంలో కరువు సంభవించినట్లు నమోదైంది.[14]

వాతావరణం

మార్చు

హిసార్‌లో ఖండాంతర శీతోష్ణస్థితి ఉంది. చాలా వేడిగా ఉండే వేసవిలు, సాపేక్షికంగా చల్లగా ఉండే శీతాకాలాలు ఇక్కడ ఉంటాయి.[15] పొడిగా ఉండడం, తీవ్ర ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం హిసార్ శీతోష్ణస్థితి లోని ప్రధాన లక్షణాలు.[16] వేసవిలో గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత 40 °C - 46 °C మధ్య ఉంటుంది. శీతాకాలంలో ఇది 1.5 °C - 4 °C మధ్య ఉంటుంది.[17] ఇక్కడ 1944 మేలో గరిష్ఠ ఉష్ణోగ్రత 48.3 °C నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రత -3.9 °C 1929 జనవరిలో నమోదైంది. వార్షిక సగటు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 32.3 °C (90.1 °F), 15.4 °C (59.7 °F). సాపేక్ష ఆర్ద్రత (రిలెటివ్ హ్యుమిడిటీ) 5 నుండి 100% వరకు ఉంటుంది.

నెలజనఫిబ్రమార్చిఏప్రిమేజూన్జూలైఆగసెప్టెంఅక్టోనవండిసెంసంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F)31.0
(87.8)
35.3
(95.5)
45.6
(114.1)
47.9
(118.2)
48.8
(119.8)
48.4
(119.1)
47.2
(117.0)
44.3
(111.7)
42.2
(108.0)
41.7
(107.1)
36.7
(98.1)
33.6
(92.5)
48.8
(119.8)
సగటు అధిక °C (°F)20.5
(68.9)
24.5
(76.1)
30.4
(86.7)
37.5
(99.5)
41.4
(106.5)
41.1
(106.0)
37.3
(99.1)
36.2
(97.2)
36.2
(97.2)
34.4
(93.9)
29.2
(84.6)
23.2
(73.8)
32.7
(90.9)
సగటు అల్ప °C (°F)7.2
(45.0)
10.0
(50.0)
15.1
(59.2)
21.0
(69.8)
25.7
(78.3)
27.9
(82.2)
27.6
(81.7)
26.9
(80.4)
24.9
(76.8)
19.3
(66.7)
13.0
(55.4)
8.2
(46.8)
18.9
(66.0)
అత్యల్ప రికార్డు °C (°F)−3.9
(25.0)
−2.2
(28.0)
2.8
(37.0)
6.6
(43.9)
13.5
(56.3)
17.8
(64.0)
20.4
(68.7)
20.0
(68.0)
14.0
(57.2)
8.3
(46.9)
2.5
(36.5)
−1.5
(29.3)
−3.9
(25.0)
సగటు వర్షపాతం mm (inches)11.7
(0.46)
20.0
(0.79)
16.2
(0.64)
11.2
(0.44)
29.3
(1.15)
63.3
(2.49)
129.8
(5.11)
113.3
(4.46)
81.8
(3.22)
7.9
(0.31)
2.2
(0.09)
4.6
(0.18)
491.5
(19.35)
సగటు వర్షపాతపు రోజులు1.21.61.61.32.14.06.55.63.00.60.20.628.3
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST)56484026283859625543485546
Source: India Meteorological Department[18][19]


జనాభా

మార్చు

1843 లో హిసార్ జనాభా 7,000 అని అంచనా.[20] 2011 భారత జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా 3,01,249 [21] భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఇది 141 వ స్థానంలో ఉంది.[22] జనాభాలో పురుషులు 54%, స్త్రీలు 46%. ప్రతి వెయ్యి మంది మగవారికి 844 మంది మహిళలు ఉన్నారు. హిసార్ అక్షరాస్యత 81.04%. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 86.13%, స్త్రీల అక్షరాస్యత 75.00%. హిసార్ జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు. బాలలలో లింగ నిష్పత్తి 860/1000. 2001-11 దశాబ్దిలో నగర జనాభా వృద్ధి రేటు 27.06%.[23]

రవాణా

మార్చు

రోడ్డు

మార్చు

జాతీయ రహదారి 9, జాతీయ రహదారి 52 లు హిసార్ గుండా వెళ్తాయి. పితోర్‌గఢ్ నుండి మాలౌట్ వెళ్ళే జాతీయ రహదారి 9, నగరాన్ని రోహ్‌తక్, సిర్సా లతో కలుపుతూండగా, జాతీయ రహదారి 52 నర్వానా, జైపూర్‌, కైతల్‌లతో కలుపుతుంది. హర్యానా రాష్ట్ర రహదారులు 10, 13, 20 హిసార్ గుండా వెళ్తాయి.[24] ఇవే కాకుండా, జిల్లా రోడ్లు, గ్రామ లింక్ రోడ్లు, కాలువ తనిఖీ రోడ్లు కూడా ఉన్నాయి.[6] 1947 లో నగరంలో పక్కా రోడ్ల మొత్తం పొడవు 137 కి.మీ. కాగా, 1978 నాటికి ఇది 1,188 కి.మీ.కు పెరిగింది.

హిసార్, వాయవ్య రైల్వే జోన్, బికనీర్ డివిజన్ పరిధిలో ఉన్న రైల్వే కూడలి.[25] 1883 లో ఢిల్లీ రేవారి రైల్వేను భటిండా వరకు విస్తరించినప్పుడు నగరానికి మొదటి రైల్వే మార్గం ఏర్పడింది.[26] ప్రస్తుతం, నాలుగు బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు ఉన్నాయి.[6] ఈ రైల్వే స్టేషన్ వెస్ట్రన్ డెడికేటెడ్ రైల్ ఫ్రైట్ కారిడార్‌లో ఒక భాగం.[27] వివిధ రైళ్ళ ద్వారా నగరం నుండి ఇతర ప్రాంతాలకు చక్కటి రవాణా సౌకర్యం ఉంది.[28]

విమానాశ్రయం

మార్చు

హిసార్ విమానాశ్రయం నగర శివార్లలో ఉంది. దేశీయ ప్రయాణీకుల సేవలను నిర్వహించడానికి ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలన్న హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికను 2012 ఆగస్టులో డిజిసిఎ ఆమోదించింది. దీనిలో భాగంగా ఇక్కడీ రన్‌వేను విస్తరించే ప్రతిపాదన ఉంది.

మూలాలు

మార్చు
🔥 Top keywords: అశ్వత్థామకర్ణుడుమహాభారతంనాగ్ అశ్విన్ధర్మపురి శ్రీనివాస్మొదటి పేజీవికీపీడియా:Contact usకల్క్యావతారముసప్త చిరంజీవులుకల్కి 2898 ఏ.డీప్రత్యేక:అన్వేషణనారా చంద్రబాబునాయుడుభజే వాయు వేగంపాండవులుఈనాడుధర్మపురి అరవింద్రమేష్ రాథోడ్అన్నదాత సుఖీభవ పథకంవిరాట్ కోహ్లిరోహిత్ శర్మతెలుగుకురుక్షేత్ర సంగ్రామంద్రోణాచార్యుడుకొండగట్టుప్రియాంక దత్రామాయణంతెలుగు అక్షరాలుభీష్ముడుమిథాలి రాజ్ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్చతుర్యుగాలుభారతీయ తపాలా వ్యవస్థ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకేశవ్ మహరాజ్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిప్రత్యేక:ఇటీవలిమార్పులుపరీక్షిత్తుమహాత్మా గాంధీఅశ్వనీ దత్